రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీలు షురూ
ఆదిలాబాద్/ఆదిలాబాద్ రూరల్: జిల్లా కేంద్రం సమీపంలోని ఓక్లే ఇంటర్నేషనల్ పాఠశాలలో 10వ తెలంగాణ వింటర్ రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీల ను సోమవారం అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ స్థాయి క్రీడాకారుల ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డీటీఎస్‌వో పార్థసారథి మా ట్లాడుతూ చిన్నారులు చదువుతోపాటు ఆటలపై దృష్టి సారించాలన్నారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సాయిని రవికుమార్ మాట్లాడుతూ ప్రతిభగల క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామన్నారు. ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బాలూరి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు. అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ మాట్లాడుతూ మంగళవారంతో పోటీలు ముగియనున్నట్లు తెలిపారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఈ నెల 27 నుంచి 29 వరకు హైదరాబాద్‌లో జరగను న్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నా రు. ఈ కార్యక్రమంలో డీవైఎస్‌వో జక్కుల శ్రీనివా స్, అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమేష్, కోశాధికారి కృష్ణమూర్తి, జిల్లా చైర్మన్ ఆదిత్య ఖండేశ్కర్, ఉపాధ్యక్షులు లాలమున్న, రాజు శ్రీధర్, సాయి, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.


