ముత్తపూర్ సర్పంచ్ స్థానం ఏకగ్రీవం
భీమిని: కన్నెపల్లి మండలం ముత్తపూర్ గ్రామపంచాయతీ సర్పంచ్‌గా ఎండీ మున్నాభీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం నామినేషన్ల ప్రక్రియ ముగిసేలోపు ముత్తపూర్ గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానానికి నామినేషన్లు ర కపోవడంతో మున్నాభీ నామినేషన్ ఒకటే కా వడంతో ఆమె ఏకగ్రీవమయ్యే అవకాశం లభించింది. ముత్తపూర్ గ్రామపంచాయతీ పరిధిలో ఎని మిది వార్డులుండగా ఇందులో నాలుగో వార్డుకు ఒకే వర్గానికి చెందిన ఇద్దరి నుంచి రెండు నామి నేషన్లు రాగా, మిగతా ఏడు వార్డులకు ఒకటి చొ ప్పున రావడంతో పంచాయతీ పాలకవర్గమంతా ఏకగ్రీవమయ్యే అవకాశముంది. ఈ సందర్భంగా ఎండీ మున్నాభీ మాట్లాడుతూ.. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ సహకారంతో ముత్తపూర్ గ్రామపంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. తాను ఏకగ్రీవంగా సర్పంచ్ అయ్యేందుకు సహకరించిన ముత్తపూర్ గ్రామస్తులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
ఎమ్మెల్యే గ్రామంలో ఏకగ్రీవం
కాసిపేట: మండలంలోని ధర్మరావుపేట గ్రా మపంచాయతీలో సర్పంచ్, రెండు వార్డు స భ్యుల ఎన్నిక ఏకగ్రీవమైంది. మంచిర్యాల ఎ మ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు స్వగ్రా మం ధర్మరావుపేటలో ఎమ్మెల్యే సోదరుడు, ఓరియంట్ సిమెంట్ కంపెనీ గుర్తింపు సంఘం అధ్యక్షుడు సత్యపాల్‌రావు ఆధ్వర్యంలో సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీ వమైంది. జుగునాక రాధ నామినేషన్ ఒక్క టే దాఖలు కావడంతో ఏకగ్రీవంగా ఎన్ని కయ్యారు. అలాగే పార్వతి పెద్దిరాజు, ఆజ్మీర శ్రీవల్లి వార్డు సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ముత్తపూర్ సర్పంచ్ స్థానం ఏకగ్రీవం


