ధాన్యం తనిఖీ కేంద్రం ఏర్పాటు
కోటపల్లి: ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ లోకి ధాన్యం రాకుండా మహారాష్ట్ర–తెలంగా ణ సరిహద్దు ప్రాంతమైన రాపన్‌పల్లి అంతర్రాష్ట్ర వంతెనపై ధాన్యం తనిఖీ కేంద్రాన్ని త హసీల్దార్ రాఘవేందర్‌రావు, ఎస్సై రాజేంద ర్ శనివారం ప్రారంభించారు. త్వరలో ధా న్యం కొనుగోళ్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి ధాన్యం రాకుండా అరికట్టేందుకే 24గంటల చెక్‌పోస్టును ప్రారంభించినట్లు వారు తెలిపా రు. పోలీస్, రెవెన్యూ, వ్యవసాశాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ చెక్‌పోస్టు వద్ద అప్రమత్తంగా ఉండి ధాన్యం రాకుండా అడ్డుకట్ట వేయాలని సిబ్బందిని ఆదేశించారు.


