మెగా జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలి
బెల్లంపల్లి: స్థానిక ఏఎంసీ క్రీడా మైదానంలో ఆది వారం నిర్వహించనున్న మెగా జాబ్‌మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్ సూచించారు. శనివారం ఏఎంసీ క్యాంపు కార్యాలయంలో సబ్ కలెక్టర్ మనోజ్, సింగరేణి మందమర్రి ఏరియా జీఎం రాధాకృష్ణతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుత పోటీ ప్రపంచానికి అనుగుణంగా సింగరేణి ప్రాంత యువతలో మా ర్పు రావాలని, విచక్షణ కోల్పోకుండా ముందుకుసా గాలని సూచించారు. సబ్ కలెక్టర్ మనోజ్ మాట్లాడుతూ.. ఏడో తరగతి నుంచి పీజీ వరకు విద్యార్హతలున్న నిరుద్యోగులు జాబ్‌మేళాకు హాజరు కావాల ని సూచించారు. జాబ్‌మేళాకు ఏర్పాట్లు చేసినట్లు జీఎం రాధాకృష్ణ తెలిపారు. ఇప్పటివరకు 5వేల పైచిలుకు మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని పేర్కొన్నారు. మేళాకు 75 కంపెనీలు హాజరవుతుండగా, దాదాపు 4వేల పైచిలుకు ఉద్యోగాలు కల్పించే అవకాశముందని తెలిపారు. ఏసీపీ ఎ.రవికుమార్, ఎ స్వోటూ జీఎం విజయప్రసాద్, పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, పలు విభాగాల అధికారులున్నారు.
ఏర్పాట్ల పరిశీలన
బెల్లంపల్లి ఏఎంసీ క్రీడామైదానంలో ఆదివారం నిర్వహించనున్న మెగా జాబ్‌మేళా ఏర్పాట్లను ఎమ్మెల్యే వినోద్ పరిశీలించారు. ఏర్పాట్లపై సింగరేణి అధికారులకు పలు సూచనలు చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మందమర్రి ఏరియా జీఎం రాధాకృష్ణ ఏర్పాట్ల గురించి ఎమ్మెల్యేకు వివరించారు.


