భూరికార్డులను డిజిటలైజ్ చేయాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లా సర్వేలో భూ రికార్డులను డిజిటలైజ్ చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మంది రంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) చంద్రయ్య, బె ల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్‌తో కలిసి తహసీల్దార్లు, సర్వేయర్లు, లైసెన్స్‌డ్ సర్వేయర్లతో సమీక్షా సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ.. మండలాల వారీగా కాడాస్ట్రాల్ మ్యాప్ లను నిర్వహించాలని తెలిపారు. ప్రభుత్వ నమూనా 1నుంచి 6వరకు సిద్ధం చేయాలని పేర్కొన్నారు. అటవీ భూములను సర్వే నుంచి మినహాయించా లని తెలిపారు. ఆరు మండలాల్లో పైలెట్ సర్వే, తొ మ్మిది మండలాల్లో తొమ్మిదిమంది ప్రభుత్వ సర్వేయర్లు, ప్రతీ మండలంలో ఆరుగురు లైసెన్స్‌డ్ సర్వేయర్ల బృందం తమ పరిధిలోని గ్రామాల్లో కచ్చితమైన సర్వే చేయాలని వివరించారు. అనధికారిక ని ర్మాణాలు, ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను గు ర్తించాలని సూచించారు. ముందుగా గ్రామాల్లో స ర్వే పూర్తి చేసిన తర్వాత సెమీ అర్బన్, అర్బన్ ప్రాంతాల్లో నిర్వహించాలని వివరించారు. అనంతరం తహసీల్దార్లతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. 2002, 2025 ఎలక్టోరల్ జాబితా మ్యాపింగ్ చేసి నాలుగు కేటగిరీలుగా విభజించినట్లు తెలిపారు. కేటగిరీ ‘ఏ’ లో 1987 కంటే ముందు జన్మించి 2002, 2025 ఎలక్టోరల్ జాబితాలో నమోదైన వారు, కేటగిరీ ‘బీ’ లో 1987 కంటే ముందు జన్మించి 2002 ఓటరు జాబితాలో లేకుండా 2025 జాబితాలో నమోదైనవారు, కేటగిరీ ‘సీ’ లో 1987 నుంచి 2002 మధ్యలో జన్మించి 2025 ఓటరు జాబితాలో నమోదైనవారు, కేటగిరీ ‘డీ’ లో 2002–2007 మధ్యలో జన్మించిన వారీగా విభజించినట్లు పేర్కొన్నారు. ల్యాండ్ సర్వే అధికారి శ్రీనివాస్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
పనులు త్వరగా పూర్తి చేయాలి
మంచిర్యాలటౌన్: జిల్లా కేంద్రంలోని కాలేజీరోడ్డులో నూతనంగా చేపట్టిన ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని క లెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. శనివారం ఆయ న భవన నిర్మాణ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు మరింత వేగవంతమైన, సౌకర్యవంతమైన సేవలందించేందుకు ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. అందులో భాగంగానే విద్య, వైద్య రంగాలను బలోపేతం చేస్తోందని పేర్కొన్నారు.


