సేవలను పోర్టల్‌లో నమోదు చేయాలి
మంచిర్యాలటౌన్: జిల్లాలో క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ ప్రకారం నమోదు చేసుకున్న ప్రతీ ప్రైవేట్ ఆస్పత్రిలో అందిస్తున్న వైద్యసేవలు, ప్రసవాలను పోర్టల్‌లో నమోదు చేయాలని డీఎంహెచ్‌వో అనిత సూచించారు. జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యులు, సీ్త్ర వైద్య నిపుణులతో శనివారం జిల్లా వైద్యారో గ్యశాఖ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరిగే ప్ర సవాల్లో సిజేరియన్లు తగ్గించి, సాధారణ ప్రసవాల ను పెంచాలని సూచించారు. ఫిజీషియన్ల వద్ద న మోదయ్యే హెచ్‌ఐవీ కేసుల వివరాలను ఐసీటీసీ సెంటర్‌కు అందించాలని, రోజువారీ వివరాల్లో క మ్యూనికేబుల్ డిసీజెస్, నాన్ కమ్యూనికేబుల్ వ్యా ధుల వివరాలు ప్రతీ ఆస్పత్రికి ఇచ్చిన పాస్‌వర్డ్‌ల ద్వారా నమోదు చేయాలని ఆదేశించారు. పీసీపీఎన్‌డీటీ యాక్ట్ ప్రకారం నమోదు చేసుకున్న 51 ఆస్పత్రుల్లోని వివరాలను రోజువారీగా ఫామ్ ‘ఎఫ్’ ద్వారా అందించాలని తెలిపారు. ఆస్పత్రికి వచ్చే గర్భిణులకు ఆడబిడ్డకు ఎంత ప్రాముఖ్యత ఉందో తెలియజేయాలని సూచించారు. ఐఎంఏ సభ్యుడు డాక్టర్ రవిప్రసాద్, రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ సెక్రెటరీ డాక్టర్ ఎగ్గన శ్రీనివాస్, వైద్యులు అనిల్‌కుమార్, చంద్రదత్, శ్రీనివాస్, ఝాన్సీ, నందిని, జ్యోతి, శృతి, మాధురి, స్వాతి, సంధ్యారాణి, డీపీవో నీలిమ, డెమో బుక్క వెంకటేశ్వర్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ప్రసాద్, డాక్టర్ సుధాకర్‌నాయక్ పాల్గొన్నారు.
ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన
జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లు, సిబ్బందికి డేటా ఎంట్రీ ఆపరేటర్లకు వైద్య ఆరోగ్య కార్యక్రమాలపై డీఎంహెచ్‌వో అనిత ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఆస్పత్రులకు వచ్చే రోగుల వివరాలు నమోదు చేయాలని, ఆధా ర్‌కార్డుతో అనుసంధానం చేయడం ద్వారా వారి వి వరాలు పోర్టల్‌లో నమోదు చేసే అవకాశం ఉందని తెలిపారు. వైద్యులు ప్రసాద్, సుధాకర్‌నాయక్, డీపీవో ప్రశాంతి, ప్రవళ్లిక, భాగ్య, డీడీఎంలు చారి, కాంతారావు, ఎస్వో వెంకటేశ్వర్ పాల్గొన్నారు.


