
ఏఎస్‌డబ్ల్యూవోగా ధర్మానంద్‌గౌడ్ బాధ్యతల స్వీకరణ
మంచిర్యాలఅర్బన్: జిల్లా ఎస్సీ ఏఎస్‌డబ్ల్యూవోగా ధర్మానంద్‌గౌడ్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇదివరకు ఏఎస్‌డబ్ల్యూవోగా విధులు నిర్వహించిన సురేష్‌పై ఆరోపణల నేపథ్యంలో బాధ్యతల నుంచి తొలగించి ధర్మానంద్‌గౌడ్‌కు పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు(ఎఫ్‌ఏసీ) అప్పగించారు. బుధవారం రాత్రి ఎస్సీ కళాశాల బాలుర, బాలికల వసతిగృహాలను తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ బాగా చదవుకుని తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని సూచించారు. ఎస్సీ కళాశాల వసతిగృహ నిర్వాహకులు కుమారస్వామి, చందన పాల్గొన్నారు.