
వచ్చే నెల ఒకటి నుంచి పత్తి కొనుగోళ్లు
నస్పూర్: నవంబర్ ఒకటి నుంచి పత్తి కొనుగోళ్ల ప్రక్రియ సమర్థవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. రై తులు పత్తిని దళారులకు విక్రయించి మోసపోవద్దని సూచించారు. బుధవారం ఆయన కలెక్టర్ చాంబర్‌లో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, జి ల్లా వ్యవసాయాధికారి సురేఖ, మార్కెటింగ్ అధి కారి షహబుద్దీన్, ముఖ్య ప్రణాళిక అధికారి స త్యంతో కలిసి సీసీఐ అధికారులు, జిన్నింగ్ మిల్లు ల నిర్వాహకులతో పత్తి కొనుగోలుపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ పత్తి కొనుగోలు కేంద్రాల్లో కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తామని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి పత్తి జిల్లాలోకి రాకుండా సరిహద్దుల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని సూచించారు. రెవెన్యు, మండల వ్యవసాయాధికారి, పోలీస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి కొనుగోలుపై పర్యవేక్షిస్తామని తెలిపారు.
సీఎంఆర్ లక్ష్యాలు పూర్తి చేయాలి
నస్పూర్: జిల్లాలోని రైస్‌మిల్లులకు ఖరీఫ్, రబీలకు సంబంధించి కేటాయించిన సీఎంఆర్ డెలివరీ లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం ఆయన కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ చంద్రయ్య, జిల్లా పౌర సరఫరాల అధికారి బ్రహ్మరావు, జిల్లా మేనేజర్ శ్రీకళతో కలిసి పౌరసరఫరాల శాఖ అధికారులు, రైస్‌మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులు, రైస్‌మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ 2024–25 సంవత్సరానికి కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేసి 2025– 26 సంవత్సరం ఖరీఫ్, రబీ సీజన్ వరి ధాన్యం కో సం బ్యాంకు గ్యారంటీలు, ఒప్పందాలు సమర్పించా లని తెలిపారు. లక్ష్యాలు పూర్తి చేయని డిఫాల్టర్ రైస్‌మిల్లులకు ధాన్యం కేటాయించబోమన్నారు.