
వార్డెన్‌ను వేధించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి
మంచిర్యాలటౌన్: లక్సెట్టిపేట ఎస్సీ బాలుర వసతి గృహం వార్డెన్ రాజగోపాల్‌ను వేధింపులకు గురిచేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు మార్ దీపక్, జిల్లా ఎస్సీ సంక్షేమశాఖ అధికారి దు ర్గాప్రసాద్‌కు మంగళవారం టీఎన్జీవోస్ సభ్యులు వి నతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. హాస్టల్ పిల్లల సంక్షేమానికి ఖర్చు చే సిన బిల్లులు మంజూరు చేయకుండా వ్యక్తిగతంగా అవమానిస్తూ తీవ్ర మనోవేదనకు గురి చేయడంతో నే వార్డెన్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని ఆరో పించారు. హాస్టల్ వార్డెన్‌కు తక్షణమే న్యాయం చేసి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. టీఎన్జీవోస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు శ్రీహరి, జిల్లా కోశాధికారి సతీశ్‌కుమార్, ఉపాధ్యక్షులు రామ్‌మార్, తిరుపతి, జాయింట్ సెక్రటరీ సు రేందర్, పబ్లిక్ సెక్రటరీ యూసుఫ్, రాజేందర్, మంచిర్యాల యూనిట్ అధ్యక్ష, కార్యదర్శులు గోపాల్, అజయ్, ప్రశాంత్, విజయ, బెల్లంపల్లి యూనిట్ అధ్యక్షుడు వెంకటేశ్, సభ్యులు గంగారాం, సంజీవ్‌రావు, సునీత, సుభద్ర, సుధాలక్ష్మి ఉన్నారు.