
హోరాహోరీగా జోనల్‌స్థాయి ఎంపిక పోటీలు
ఆసిఫాబాద్‌రూరల్: జోనల్‌స్థాయి వాలీబాల్ పోటీలు బుధవారం జిల్లా కేంద్రంలో హోరాహోరీగా సాగాయి. జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాలలో జోనల్‌స్థాయి పోటీలు నిర్వహించారు. ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి వెంకటేశ్ మాట్లాడుతూ జోనల్‌స్థాయి బాలికల వాలీబాల్ పోటీలకు ఉమ్మడి జిల్లా నుంచి మొత్తం 48 మంది క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు. వీరిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 12 మందిని ఎంపిక చేశామని తెలిపారు. వీరిలో ఆసిఫాబాద్ నుంచి ఐదుగురు, మంచిర్యాల నుంచి ఐదుగురు, నిర్మల్ నుంచి ఇద్దరు క్రీడాకారులను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. వీరు మహబూబ్‌నగర్‌లో ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. పీడీ మీనారెడ్డి, ఖేల్ ఇండియా కోచ్ రాకేశ్, పీఈటీలు లక్ష్మి, నాగమణి, భవిత, లక్ష్మణ్, శ్రీనివాస్, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.
గంజాయి సాగు చేస్తున్న ఒకరిపై కేసు
లింగాపూర్: సిర్పూర్(యూ) మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సిర్పూర్(యూ) మండలంలోని పంగిడి గ్రామ పంచాయతీ పరిధిలోని పెద్దదోబ గ్రామ శివారులోని పత్తి చేనులో 35 గంజాయి మొక్కలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మొక్కలు సాగు చేస్తున్న వల్క శంకర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు.