
అందరికీ విజయాలు చేకూర్చాలి
మంచిర్యాలక్రైం: విజయదశమి అందరికీ విజయాలు చేకూర్చాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. గురువారం విజయదశమి సందర్భంగా కమిషనరేట్ ఆవరణలోని దుర్గమాత సన్నిధిలో పోలీస్ అధికారులతో కలిసి ఆయుధ, వాహన పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు ఎగ్గడి భాస్కర్, కరుణాకర్, అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ ఏసీపీలు, సీఐలు, ఎస్సైలు సిబ్బంది పాల్గొన్నారు. మంచిర్యాల పోలీస్‌స్టేషన్‌లో ఏసీపీ ప్రకాశ్‌ఆధ్వర్యంలో ఆయుధ పూజ నిర్వహించారు. సీఐ ప్రమోద్‌రావు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.