
ఘనంగా దసరా వేడుకలు
మంచిర్యాలఅర్బన్: విజయదశమి పర్వదిన సంబరాలు మంచిర్యాలలో అంబరన్నాంటాయి. గురువారం ఉత్సవాల్లో భాగంగా ఆనవాయితీ ప్రకారం విశ్వనాథ ఆలయం నుంచి ఉత్సవ దేవతామూర్తులతో గోదావరి రోడ్డులోని గౌతమేశ్వర ఆలయం వరకు రథోత్సవం నిర్వహించారు. విశ్వనాథ ఆలయం నుంచి శ్రీదేవి, భూదేవి సహిత వెంకటేశ్వరస్వామి, పార్వతీపరమేశ్వరుల ఉత్సవ విగ్రహాలతో పట్టణ పురవీధుల మీదుగా గౌతమేశ్వర ఆల యం వరకు రథోత్సవం సాగింది. అక్కడ ఆలయ ఆవరణలోని జంబి వృక్షానికి వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య ఘనంగా పూజలు నిర్వహించారు. అనంతరం జమ్మి ఇచ్చుకుంటూ అలయ్ బలయ్ తీసుకున్నారు. స్థానిక రాంనగర్‌లో రావణవధ కార్యక్రమం నిర్వహించగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమంలో ఆలయ ఈవో రవి, డీసీసీ అధ్యక్షురాలు సురేఖ, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

ఘనంగా దసరా వేడుకలు

ఘనంగా దసరా వేడుకలు