
మున్నూరుకాపులు ఐక్యం కావాలి
జైపూర్: రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మున్నూరుకాపు కులస్తులంతా ఐక్యం కావా లని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పుట్టం పురుషోత్తం పిలుపునిచ్చారు. ఆదివారం ముసాయిపేట్‌లో ఏర్పాటు చేసిన సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి చెన్నూర్ నియోజకవర్గం నుంచి పెద్దింటి పున్నంచంద్, పిల్లి సమ్మయ్య, ఆర్నే సమ్మయ్యతో పాటు పలు వురు హాజరయ్యారు. ఈ సందర్భంగా నా యకులు మాట్లాడుతూ అత్యధిక జనాభా కలి గిన మున్నూరుకాపులకు రాజకీయంగా, ఉద్యోగ రంగాల్లో సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని, దీని కోసం అన్ని గ్రామాల్లో ఉన్న ము న్నూరుకాపులను చైతన్యం చేయాలన్నారు.