భైంసారూరల్: మండలంలోని కోతల్‌గాం సమీపంలోని చెక్‌డ్యాం వద్ద పల్సికర్ రంగారావు ప్రాజెక్టులో మునిగి పవార్ రాజు(36) మృతి చెందినట్లు ఎస్సై శంకర్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మహాగాం గ్రామానికి చెందిన పవార్ రాజు గత నాలుగు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాలేదు. కుటుంబీకులు బంధువులు, తెలిసినవారి వద్ద వెతికిన ఆచూకీ దొరకలేదు. కోతల్‌గాం సమీపంలోని చెక్‌డ్యాం వద్ద ప్రాజెక్టు వాటర్‌లో మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. వారు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం అనంతరం కుటుంబీకులకు అప్పగించారు. భార్య కవిత ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
రెండు బైక్‌లు ఢీకొని ఒకరు మృతి
రెబ్బెన: మండలంలోని వంకులం స మీపంలో పెద్దవా గు వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొని ఒకరు అక్కడికక్క డే మృతి చెందా డు. ఎస్సై వెంకటకృష్ణ కథనం ప్రకారం.. ఆసిఫాబాద్ మండలం రాపెల్లికి చెందిన సు నార్కర్ ఆనంద్‌రావు (47) వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఆదివారం కాగజ్‌నగర్ నుంచి బైక్‌పై రాపెల్లికి వెళ్తుండగా మార్గమధ్యలో ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొట్టింది. ఈ ప్ర మాదంలో ఆయన తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మరోబైక్‌పై ప్రయాణిస్తున్న ఎన్నం తిరుపతి, ఎన్నం కృష్ణకుమార్‌కు గాయాలు కాగా ప్రైవేటు వాహనంలో కా గజ్‌నగర్ తరలించారు. మృతుడికి భార్య, ఇ ద్దరు కూతుళ్లు ఉన్నారు. భార్య సురేఖ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
విద్యుత్‌షాక్‌తో ఒకరు..
మందమర్రిరూరల్: మందమర్రి పోలీస్‌స్టేషన్ పరిధి యాపల్ ప్రాంతంలోని జీఎం ఆఫీస్ సమీపంలో ఆదివారం విద్యుత్ షాక్‌తో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సుకులాల్ యాదవ్‌వ్ (31) మృతి చెందాడు. ఎస్సై రాజశేఖర్, మృతుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు.. నాలుగేళ్ల క్రితం సుకులాల్ కుటుంబంతో జీవనోపాధి కోసం మందమర్రికి వచ్చారు. కూలీపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆదివారం ఉదయం పనికి వెళ్లడానికి వేడి అన్నం పెట్టుకున్నాడు, చల్లార్చుకోడానికి కూలర్ స్విచ్ ఆన్‌చేసే క్రమంలో విద్యుత్ షాక్‌కు గురై కిందపడిపోయాడు. వెంటనే కుటుంబసభ్యులు 108 సిబ్బందికి సమాచారం అందించారు. సమీపంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. 108 సిబ్బంది అక్కడికి చేరుకుని సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు, ఒక కుమారుడు ఉన్నారు. సుకులార్ మృతదేహాన్ని చత్తీస్‌గఢ్ తరలించేందుకు హిందూ శ్మశానవాటిక కేకే–ఓసీ కమిటీ సభ్యులు విరాళాలు సేకరించి రూ.70 వేలను కుటుంబసభ్యులకు అందించారు.
ప్రాజెక్టులో మునిగి ఒకరి మృతి
ప్రాజెక్టులో మునిగి ఒకరి మృతి