
వైద్య విద్యార్థినికి బంగారు పతకం
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హైదరాబా ద్‌లోని గాంధీ మెడికల్ కళాశాల ఫార్మేషన్ డే సందర్భంగా జిల్లాకు చెందిన వైద్య విద్యార్థిని గడియారం అక్షయ బంగారు పతకం అందుకుంది. మైక్రో బయోలజీ సబ్జెక్ట్‌లో కళాశాల టాపర్‌గా నిలిచిన అక్షయ ఆదివారం డాక్టర్ రాజారెడ్డి చేతుల మీదుగా బంగారు పతకం, ప్రశంసాపత్రం అందుకుంది. ప్రస్తుతం గాంధీ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని హౌజ్‌సర్జన్‌గా చేస్తున్న డాక్టర్ అక్షయ బంగారు పతకం సాధించడం గర్వంగా ఉందని తల్లిదండ్రులు పల్లవి, శ్రీహరి సంతోషం వ్యక్తం చేశారు.