
బకాయిలు విడుదల చేయాలి
ప్రైవేట్ డిగ్రీ కళాశాలలకు నాలుగేళ్లుగా (ఎంటీఎఫ్, ఆర్‌టీఎఫ్) ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రభుత్వం పెండింగ్ పెట్టింది. చదువు పూర్తయిన విద్యార్థులకు సర్టిఫికెట్లు నిలిపివేయవద్దని హుకుం జారీ చేస్తున్న ప్రభుత్వం బకాయిలు మాత్రం చెల్లించడంలేదు. అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. భవనాల అద్దె, అధ్యాపకుల వేతనాలు, ఇతర బిల్లులు చెల్లించకలేక ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు బంద్ కొనసాగిస్తాం.
– ఎస్వీ రమణ,
టీపీడీపీఎంఏ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు