
మావల @ గ్రావిటీ స్పెషల్
కై లాస్‌నగర్: నిజాం హయాంలో ఆదిలాబాద్ పట్టణానికి గ్రావిటీ ద్వారా నీటిని సరఫరా చేసేలా చేపట్టిన పైపులైన్, ఫిల్టర్‌బెడ్ నిర్మాణాలు నాటి ఇంజినీరింగ్ ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
గ్రావిటీ ద్వారా నీటి సరఫరా
నిజాం హయాంలో ఆదిలాబాద్ వాసుల దాహా ర్తి తీర్చేందుకు పట్టణానికి పది కిలోమీటర్ల దూ రంలో గల మావల అటవీ ప్రాంతంలో 60 ఎకరాల విస్తీర్ణంలో చెరువు నిర్మించారు. 1925లో నిర్మాణాన్ని ప్రారంభించగా 1948లో అందుబాటులోకి వచ్చింది. భారీ వరదలు, తుపానులు వచ్చినా తట్టుకుని నిలబడేలా కట్టను నిర్మించారు. ఇప్పటికీ చిన్నపాటి లీకేజీలు సైతం లేకపోవడం పనుల నాణ్యతకు అద్దం పడుతోంది. ముఖ్యంగా చెరువు నుంచి ఫిల్టర్‌బెడ్ వరకు భూగర్భంలో నిర్మించిన ఫైపులైన్ ఔరా అనిపిస్తోంది. గ్రావిటీ ద్వారా వచ్చే చెరువు నీరు ఆదిలాబాద్ పట్టణంలోని 25 శాతం జనాభాకు తాగునీటి ఇబ్బందులను దూరం చేస్తోంది.
ఫిల్టర్‌బెడ్
మావల చెరువు నుంచి వచ్చే నీటిని శుద్ధిచేసేలా కలెక్టరేట్ పక్కన పదెకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఫిల్టర్‌బెడ్ సైతం ప్రత్యేకంగా నిలుస్తోంది. చెక్‌డ్యాంల ద్వారా మూడు దశల్లో శుద్ధి చేసిన జలాన్ని పంప్‌హౌస్ నుంచి పట్టణంలోని ట్యాంకులకు విడుదల చేస్తారు. వాటి ద్వారా ఇళ్లకు సరఫరా అవుతోంది. దీనిని లండన్‌కు చెందిన ది క్యాండీ ఫిల్టర్ కంపెనీ 1947లో నిర్మించడం గమనార్హం.
ఆదిలాబాద్‌లోని ఫిల్టర్‌బెడ్
గ్రావిటీ ద్వారా నీరందించే మావల చెరువు

మావల @ గ్రావిటీ స్పెషల్