
నేడు మంత్రి వివేక్ ఇంటి ఎదుట ధర్నా
బెల్లంపల్లి: అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, గనులు, భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివే క్ ఇంటి ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా అధ్యక్షురాలు భానుమ తి, ప్రధాన కార్యదర్శి రాజమణి తెలిపారు. ఆదివారం పట్టణంలోని సీఐటీయూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. అంగన్‌వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రీప్రైమరీ నిర్వహించాలని, పీఎంశ్రీ ని ధులను మంజూరు చేయాలని డిమాండ్ చేశా రు. అంగన్‌వాడీలు అధికసంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కో రారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి డి.రంజిత్, బెల్లంపల్లి మండల కన్వీనర్ సీహెచ్ దేవదాస్, తదితరులు పాల్గొన్నారు.