
పనులు పెండింగ్ లేకుండా చూడాలి
లక్సెట్టిపేట: కార్యాలయంలో ఎలాంటి పనులు పెండింగ్ లేకుండా చూడాలని జాయింట్ కలెక్టర్ చంద్రయ్య అన్నారు. శనివారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలకు 14 మంది జీపీవోలను ప్రభుత్వం నియమించిందని, ఇక సిబ్బంది కొరత ఉండదని, ఎలాంటి పనులను పెండింగ్ లేకుండా ప్రజలకు సేవలందించాలన్నారు. మిస్సింగ్ సర్వే నంబర్, డిజిటల్ సంతకాల కోసం వచ్చిన దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిశీలించి విచారణ చేపట్టాలన్నారు. భూభారతిలో పెండింగ్ ఉన్న దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలన్నారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ దిలీప్‌కుమార్, డీటీ శ్రావణి, సీనియర్ అసిస్టెంట్ నవనీత్, సిబ్బంది పాల్గొన్నారు.