
జిల్లాలో 29.6 మి.మీల వర్షం
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం వరకు 29.6 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. నెన్నెలలో 93.7, మందమర్రిలో 66.4, కాసిపేటలో 56, హాజీపూర్‌లో 45.8, బెల్లంపల్లిలో 44.1, చెన్నూర్‌లో 31.6, వేమనపల్లిలో 28.4, కోటపల్లిలో 26, జన్నారంలో 22.9, దండేపల్లిలో 12.7, మంచిర్యాలలో 19.6, తాండూర్‌లో 17, నస్పూర్‌లో 13.8, భీమారంలో 13.9, కన్నెపెల్లిలో 12.5, లక్సెట్టిపేటలో 10.4, భీమినిలో 9.2, జైపూర్‌లో 8.7 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో సాధారణ వర్షపాతం 848.9 మి.మీ కురవాల్సి ఉండగా 865.3 మి.మీ నమోదైంది.