
రబీ సీఎంఆర్ లక్ష్యాలు పూర్తి చేయాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: రబీ సీజన్‌కు సంబంధించి సీఎంఆర్ లక్ష్యాలను అక్టోబర్ 31 వరకు పూర్తి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, పౌరసరఫాల శాఖ అధికారి బ్రహ్యరావు, జిల్లా మేనేజర్ శ్రీకళలతో కలిసి సీఎంఆర్ లక్ష్యాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ 2024 రబీ సీజన్‌కు సంబంధించి సీఎంఆర్ లక్ష్యాలను అక్టోబర్ 31 వరకు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమలో అధికారులు, రైస్ మిల్లర్ల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
సమస్య సామరస్యంగా పరిష్కరించుకోవాలి
సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం కలెక్టర్ చాంబర్‌లో డీసీపీ ఏ.భాస్కర్‌తో కలిసి ఈ నెల 12న దండేపల్లి మండలం దమ్మన్నపేట, మామిడిగూడలో జరిగిన ఘటనపై గిరిజనులతో మాట్లాడారు. సమస్య శాశ్వత పరిష్కారం దిశగా సామరస్యంతో ముందుకెళ్లాలని సూచించారు. గిరిజనల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. గిరిజనులు అర్థికంగా ఎదిగేందుకు చేయూత అందించడం జరుగుతుందని, సమస్యల పరిష్కారం కోసం అధికార యంత్రాంగం ఎల్ల ప్పుడూ అండగా ఉంటుందని, భౌతిక దాడులకు పాల్పడవద్దన్నారు.