
ఎల్‌ఐసీ ఎడ్యుకేషన్ సెమినార్
పాతమంచిర్యాల: జిల్లా కేంద్రంలోని సాయిచంద్ర ఫంక్షన్ హాల్‌లో శనివారం ఎల్‌ఐసీ ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఎడ్యుకేషన్ సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏవోఐ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్.మంజునాథ్ హాజరై మాట్లాడారు. ఎల్‌ఐసీ ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా పోరాటాల ఫలితంగానే ఇన్సూరెన్స్ సెక్టార్‌లో జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం తగ్గించిందన్నారు. పలుమార్లు ఐఆర్‌డీఏ కార్యాలయం, ఢిల్లీలోని జంతర్ మంతర్, అన్ని డివిజన్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేపట్టామన్నారు. అనంతరం బ్రాంచ్ నూతన కమిటీని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎల్‌ఐసీ ఏజెంట్‌లు, ఉద్యోగులు, డెవలప్‌మెంట్ అధికారులు పాల్గొన్నారు.