
మహిళల భద్రతకు షీ టీమ్ భరోసా
మంచిర్యాలక్రైం: మహిళల భద్రతకు షీ టీమ్ భరోసా కల్పిస్తుందని డీసీపీ ఎగ్గడి భాస్కర్ అన్నారు. శనివారం డీసీపీ కార్యాలయంలో షీ టీమ్, భరోసా కేంద్రాల సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 114 ఫిర్యాదులు రాగా అందులో 18 క్రిమినల్, ఏడు పెట్టి కేసులు నమోదు చేశామన్నారు. 89 ఫిర్యాదులకు కౌన్సిలింగ్‌లు నిర్వహించామన్నారు. గత ఆగస్టు వరకు 81 మంది పోకిరీలకు కౌన్సిలింగ్ ఇచ్చామన్నారు. కళాశాలలు, స్కూళ్లు, బస్టాండ్, రైల్వేస్టేషన్, పబ్లిక్ ప్రాంతాల్లో పోలీసులు మఫ్టీలో ఉంటూ పోకిరీల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తున్నారన్నారు. నేరుగా ఫిర్యాదు చేయడానికి ఇబ్బందిగా ఉంటే 63039 23700 లేదా 87126 59385 వాట్సాప్ నంబర్లు లేదా డయల్ 100 డయల్‌కు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. సమావేశంలో మహిళా పోలీస్‌స్టేషన్ సీఐ నరేష్ కుమార్, షీ టీమ్ ఇన్‌చార్జి ఎస్సై ఉషారాణి, తదితరులు పాల్గొన్నారు.
షీ టీమ్ అదుపులో నలుగురు
జిల్లా కేంద్రంలోని రాముని చెరువు ఉద్యానవనం వద్ద ఈవ్‌టీజింగ్‌కు పాల్పడిన నలుగురిని శనివా రం అదుపులోకి తీసుకున్నట్లు షీ టీమ్ ఇన్‌చార్జి ఎస్సై ఉషారాణి తెలిపారు. సదరు యువకులు బా లికలతో ఆసభ్యంగా ప్రవర్తిస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.