పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి | - | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి

Sep 14 2025 3:23 AM | Updated on Sep 14 2025 3:23 AM

పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి

పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి

పాతమంచిర్యాల: మధ్యాహ్న భోజన కార్మికులకు రావాల్సిన పెండింగ్‌ బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలో మద్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా నాలుగో మహా సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 9 నెలల పెండింగ్‌ బిల్లులు విడుదల చేయాలని, 25 ఏళ్లుగా పని చేస్తున్న కా ర్మికులకు ఉద్యోగ భద్రత, ప్రమాద బీమా, పింఛన్‌ సౌకర్యాలు కల్పించాలన్నారు. మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా అధ్యక్షురాలు దాసరి రాజేశ్వరి మాట్లాడుతూ బిల్లులు చెల్లించని పక్షంలో ఈ నెల 15 నుంచి ఎంఈవో కార్యాలయాల ఎదుట ధర్నా చేపడతామన్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు గోమాస ప్రకాష్‌, జన్నారం మండల కన్వీనర్‌ అంబటి లక్ష్మణ్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement