
ఉత్తమ ఫలితాలకు కృషి చేయాలి
దండేపల్లి/లక్సెట్టిపేట: విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని రీజినల్ జాయింట్ డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన లక్సెట్టిపేటలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను పరిశీలించి ఉపాధ్యాయులతో మాట్లాడారు. దండేపల్లిలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించిన దండేపల్లి, జన్నారం, లక్సెట్టిపేట మండలాల భౌతికశాస్త్ర ఉపాధ్యాయుల స్కూల్‌కాంప్లెక్స్ సమావేశాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోధనలో డిజిటల్ వ్యవస్థ పెరిగిపోతున్నందున ఉపాధ్యాయులు ఆ దిశగా నైపుణ్యాలు పెంపొందించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో లక్సెట్టిపేట పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శైలజ, కాంప్లెక్స్ హెచ్‌ఎం సంగర్స్ రాజేశ్వర్‌రావు, రీసోర్స్‌పర్సన్లు అప్పాల మనోహర్, వేణుగోపాల్, శ్రీనివాస్, సైన్స్ ఉపాధ్యాయులు
వినతిపత్రం అందజేత
లక్సెట్టిపేట మండలంలోని ప్రైవేటు పాఠశాలల్లో అధికంగా ఫీజు వసూలు చేస్తున్నారని యూఎస్ ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి మిట్టపల్లి తిరుపతి, సహాయ కార్యదర్శి గీతాంజలి ఆర్‌జెడీ సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.