
కేజీబీవీ పనులు పూర్తిచేయాలి
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
బెల్లంపల్లి: కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయ పరిధిలో చేపట్టిన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయ పరిధిలో చేపట్టిన అదనపు గదులు, మూత్రశాలల పనులను ఎంపీడీవో మహేందర్‌తో కలసి పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు తీసుకుంటోందని తెలిపారు. విద్యార్థులతో మాట్లాడి సౌకర్యాలు, మధ్యాహ్న భోజన వివరాలు తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధులు, ఎలర్జీ ఇతర లక్షణాలు కనిపిస్తే సమీప వైద్యశాలలో చికిత్స అందించాలని సూచించారు. ఏఈ వినయ్‌కుమార్ పాల్గొన్నారు.