
యూరియా కొరత లేకుండా చేస్తున్నాం
● మంత్రి వివేక్‌వెంకటస్వామి
లక్సెట్టిపేట: జిల్లాకు యూరియా కొరత లేకుండా చేస్తున్నామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి అన్నారు. శుక్రవారం మంచిర్యాలకు వెళ్తున్న ఆయన స్థానిక అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి తేనీరు తాగి కాసేపు మాట్లాడారు. యూరియా కొరత కేంద్రం వల్లనే ఏర్పడిందని, తక్కువ స్టాకును పంపడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రైతుల ఇబ్బందులు తొలగించేందుకు యూరియాను ఎక్కువగా తెప్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు దమ్మ సునీల్, శాంతికుమార్, రవి, కిషన్, రవీందర్, మల్లేష్, తిరుపతి పాల్గొన్నారు.