
‘మత్తడివాగు’ రెండు గేట్ల ఎత్తివేత
దిగువకు వెళ్తున్న వరదనీరు
మండలంలోని వడ్డాడి సమీపంలో గల మత్తడివాగు ప్రాజెక్టు రెండు గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలారు. వరుసగా కురుస్తున్న వర్షాలకు భారీగా వరదనీరు ప్రాజెక్టులోకి చేరుతుంది. ఇన్‌ఫ్లో ద్వారా 1290 క్యూసెక్కుల నీటిని రెండు గేట్లను ఎత్తి 3567 క్యూసెక్కుల నీరు దిగువకు వదిలినట్లు ఏఈ హరీశ్ కుమార్ తెలిపారు. పూర్తిస్థాయి నీటిమట్టం 277.50 మీటర్లు కాగా ప్రస్తుతం 277.40 మీటర్ల వద్ద నీరు నిల్వ ఉందని పేర్కొన్నారు. భారీవర్షాల నేపథ్యంలో మరిన్ని గేట్లు ఎత్తి నీటిని వదిలే
అవకాశం ఉన్నందున దిగువ ప్రాంతప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. – తాంసి