
విద్యారంగానికి ప్రభుత్వం ప్రాధాన్యత
మంచిర్యాలఅర్బన్: ప్రభుత్వం విద్యారంగానికి ఎంతో ప్రాధాన్యతనిస్తోందని పాఠశాల విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు(వరంగల్) సత్యనారాయణరెడ్డి అన్నారు. గురువారం మంచిర్యాల డీసీఈబీ కార్యాలయంలో డీఈవో యాదయ్యతోపాటు ఎంఈవోలతో పాఠశాలల్లో కార్యక్రమాల అమలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతుందని, వాటి ఫలాలు ప్రతీ విద్యార్థికి అందేలా చూడాల్సిన బాధ్యత ఎంఈవోలపై ఉందని అన్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏఎక్స్‌ఎల్, ఖాన్ అకాడమీ, ఫిజిక్స్‌వాలా, డిజిటల్ లెర్నింగ్ ఇతర కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. ఎంఈవోలు ప్రతీరోజు రెండు పాఠశాలలు సందర్శించాలని సూచించారు. కార్యక్రమంలో డీసీఈబీ సెక్రెటరీ మహేశ్వర్‌రెడ్డి, అసిస్టెంట్ సెక్రెటరీ వేణుగోపాల్, సమగ్రశిక్ష కో–ఆర్డినేటర్ శ్రీనివాస్, విజయలక్ష్మీ, సత్యనారాయణమూర్తి, ఏఎస్‌సీ రాజ్‌కుమార్, డీఎస్‌వో రాజగోపాల్ పాల్గొన్నారు.