
‘ట్రాన్స్‌ఫర్ పాలసీ రద్దు చేయాలి’
శ్రీరాంపూర్: కంపెనీ నూతనంగా తీసుకువచ్చిన ట్రాన్స్‌ఫర్ పాలసీని రద్దు చేయాలని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు వీ.సీతారామయ్య డిమాండ్ చేశారు. గురువారం నస్పూర్ కాలనీలోని శ్రీరాంపూర్ ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 12న సీఎండీ స్థాయి స్ట్రక్చరల్ సమావేశం, 13న జేసీసీ సమావేశంలో కార్మికుల డిమాండ్లపై యాజమాన్యం వద్ద చర్చిస్తామని అన్నా రు. సొంతింటి వంటి ప్రధాన డిమాండ్‌పై వేసిన కమిటీ నివేదికను సమావేశంలో సమర్పి స్తారని తెలిపారు. ఈ సమావేశంలో యూని యన్ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజకుమార్, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి వైవీ రావు, ఉపాధ్యక్షుడు ఎల్.ప్రకాష్, కార్యదర్శి జూపాక రామచందర్, శ్రీరాంపూర్ బ్రాంచ్ కార్యదర్శి షేక్ బాజీసైదా, ఉపాధ్యక్షుడు కొట్టే కిషన్ రావు తదితరులు పాల్గొన్నారు.