
రుణం మాఫీ చేసి నగలు అప్పగించాలి
చెన్నూర్: బ్యాంక్‌లో బంగారు నగలు తనఖా పెట్టి తీసుకున్న అప్పును మాఫీ చేసి నగలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఎస్బీఐ బ్రాంచి–2 బాధితులు గురువారం మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. ఎస్బీఐపై నమ్మకంతో అవసరాల నిమిత్తం అభరణాలు పెట్టి అప్పు తీసుకుంటే మోసపూరితంగా మాయం చేసి మానసిక వేదనకు గురి చేశారని పేర్కొన్నారు. సుమారు 20 రోజులైనా అభరణాలు ఎప్పుడిస్తారో సరైన సమాధానం ఇవ్వకుండా మోసం చేస్తున్నారని ఆరోపించారు. రానున్న పండుగలను దృష్టిలో ఉంచుకుని నగలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎస్బీఐ గోల్డ్‌లోన్ బాధితులు పాల్గొన్నారు.