
ఘనంగా అటవీ అమరవీరుల దినోత్సవం
రామకృష్ణాపూర్: జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని మందమర్రి మండలం బొక్కలగుట్ట గాంధారి వనంలో గురువారం ఘనంగా నిర్వహించారు. అటవీ రక్షణ కోసం అసువులు బాసిన అమరవీరులకు జిల్లా అటవీ శాఖ అధి కారి శివ్ ఆశిష్ సింగ్, అధికారులు నివాళులర్పించారు. అడవులు, వన్యప్రాణులను రక్షించడానికి ప్రాణాలనే త్యాగం చేసిన వీరుల త్యాగం ఎంతో గొప్పదని అన్నారు. అనంతరం అమరవీరుల కుటుంబ సభ్యులను సన్మానించారు. గాంధారి వనం నుంచి మంచిర్యాల అటవీ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మంచిర్యాల అటవీ మండలాధికారి సర్వేశ్వర్, రేంజ్ ఆఫీసర్ రత్నాకర్, నిఘా విభాగం అధికారి రమాదేవి తదితరులు పాల్గొన్నారు.