
యూరియా కోసం తిప్పలు
వేమనపల్లి/చెన్నూర్‌రూరల్/మందమర్రిరూరల్: యూరియా కోసం రైతులు తిప్పలు పడుతూనే ఉన్నారు. వేమనపల్లి మండలం లక్ష్మిపూర్ హాకా సెంటర్ వద్ద గురువారం పొద్దంతా పడిగాపులు కాశారు. నీల్వాయిలోని పీఏసీఎస్‌కు 222 యూరియా బస్తాలు రాగా వాటిని హాకా సెంటర్ వద్ద రైతులకు పంపిణీ చేశారు. ఒక్కో రైతుకు ఒక్కో బస్తాను ఏవో వీరన్న ఆధ్వర్యంలో అందజేశారు. మరో 80మందికి దొరకకపోవడంతో వెనుదిరిగారు. చెన్నూర్ మండలం పొక్కూరు గ్రామంలో పీఏసీఎస్‌కు 222 బస్తాలు యూరియా రాగా రైతులకు ఒక్కో బస్తా అందజేశారు. మందమర్రి పాతబస్టాండ్ ఏరియాలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద గురువారం యూరియా పంపిణీ ఉందన్న విషయం తెలుసుకుని క్యాతన్‌పల్లి, మందమర్రి రైతులు ఉదయమే బారులు తీరారు. 220 బస్తాల యూరియా ఒక్కో బస్తా చొప్పున పంపిణీ చేయడంతో చాలామందికి దొరకలేదు.

యూరియా కోసం తిప్పలు