ముమ్మాటికీ కక్ష పూరితమే.. | - | Sakshi
Sakshi News home page

ముమ్మాటికీ కక్ష పూరితమే..

Sep 12 2025 5:55 AM | Updated on Sep 12 2025 5:55 AM

ముమ్మ

ముమ్మాటికీ కక్ష పూరితమే..

ఏపీలో కూటమి సర్కారు చర్యలు భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమే. వార్తలు రాసే జర్నలిస్టులపై కేసులు పెట్టడం ముమ్మాటికీ కక్షపూరిత చర్యలే. తక్షణమే ఈ చర్యలను నిలిపివేయాలని జర్నలిస్టు సంఘాల నుంచి హెచ్చరిస్తున్నాం.

– ఆర్‌.ప్రకాష్‌రెడ్డి, టీయూడబ్ల్యూజే(ఐజేయూ) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు

గొంతు నొక్కడం సరికాదు

మంచిర్యాలటౌన్‌: ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉండేలా రాస్తున్న వార్తలపై ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలే గానీ, ఆయా జర్నలిస్టులపై కేసులను పెట్టి భయభ్రాంతులకు గురిచేయడం సరికాదు. సాక్షి దినపత్రిక ఎడిటర్‌తోపాటు జర్నలిస్టులపై పోలీసు కేసులు నమోదు చేయడం, ప్రజల పక్షాన పనిచేసే జర్నలిస్టుల గొంతునొక్కడంను మా సంఘం ఖండిస్తుంది.

– మిట్టపల్లి మధు, తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్టు ఫెడరేషన్‌(టీయూడబ్ల్యూజేఎస్‌) జిల్లా అధ్యక్షుడు

కక్షసాధింపు చర్యలు సరికాదు

ఆసిఫాబాద్‌అర్బన్‌: ఏపీలో సాక్షి దినపత్రిక ప్రజల పక్షాన నిజాలు వెలికి తీస్తుంటే అది భరించలేక దినపత్రిక యాజమాన్యం, జర్నలిస్టులపై దాడులు చేయడం, కక్షసాధింపు చర్యలకు పాల్పడడం పత్రిక స్వేచ్ఛను హరించడమే అవుతుంది. అక్కడి కూటమి ప్రభుత్వం దినపత్రికపై కక్ష సాధించడం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుంది. దాడులు, కక్ష సాధింపు చర్యలు మానకపోతే జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమిస్తాం.

– గణపురం మహేష్‌, తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్టు ఫెడరేషన్‌ జాతీయ కౌన్సిల్‌ సభ్యుడు

ముమ్మాటికీ కక్ష పూరితమే..1
1/2

ముమ్మాటికీ కక్ష పూరితమే..

ముమ్మాటికీ కక్ష పూరితమే..2
2/2

ముమ్మాటికీ కక్ష పూరితమే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement