
నిరంకుశ చర్యలు సమంజసం కాదు
పత్రిక స్వేచ్ఛ అనేది ప్రజాస్వామ్యానికి గీటురాయి లాంటిది. పత్రికలు నిర్భయంగా వాస్తవాలు వెల్లడిస్తేనే ప్రజల సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఏపీలో సాక్షి పత్రికపై అక్కడి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న నిరంకుశ చర్యలు సమంజసం కాదు. ఒక రాజకీయ నాయకుడి సమావేశం వివరాలను ప్రచురిస్తే తప్పు ఎలా అవుతుంది. ఎవరికై నా ఇబ్బంది ఉంటే పరువునష్టం కేసు సదరు నాయకుడు వేసుకోవచ్చు. కానీ పత్రికను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బందులకు గురి చేయరాదు. బుధవారం తెలంగాణ హైకోర్టు వెలువరించిన నల్ల బాలు కేసు తీర్పు అదే విషయాన్ని స్పష్టం చేస్తుంది.
– రంగు రాజేశం, తెలంగాణ సామాజిక న్యాయవేదిక కన్వీనర్
కేసులు ఎత్తివేయాలి
ఆసిఫాబాద్: సాక్షి దినపత్రిక ఎడిటర్, జర్నలిస్టులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్ప డడం సిగ్గుచేటు. నిరంకుశంగా వ్యవహరించడం సమంజసం కాదు. కథనాలపై అభ్యంతరాలుంటే ప్రజాస్వామ్యబద్ధంగా వివరణ కోరాలి. కానీ అక్రమ కేసులు పెట్టడం సరికాదు. సాక్షి దినపత్రికపై కూటమి ప్రభుత్వం తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర గవర్నర్ వెంటనే స్పందించి సాక్షి ఎడిటర్‌పై పెట్టిన కేసులను ఎత్తివేయాలి. లేనిపక్షంలో పత్రికా స్వేచ్ఛ పరిరక్షణకు ఉద్యమిస్తాం. – అబ్దుల్ రహమాన్,
టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు

నిరంకుశ చర్యలు సమంజసం కాదు