
బీసీ రిజర్వేషన్ల కోసం నిరసన దీక్ష
పాతమంచిర్యాల: బీసీ రిజర్వేషన్ల కోసం రాజ్యాంగాన్ని సవరించాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి నాయకులు బుధవారం స్థానిక గాంధీ పార్కు వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడు తూ కేంద్రం రాజ్యాంగంలోని ఆర్టికల్ 103ను సవరించి 10శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించిందని, బీసీలు రిజర్వేషన్లు కల్పించాల ని అడిగితే కుంటిసాకులు చెబుతోందని విమర్శించారు. బీసీలకు పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు 50శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు గజెళ్లి వెంకటయ్య, శాఖపురి భీంసేన్, అంజన్న, లంక సతీష్ పాల్గొన్నారు.