
నాలుగు నెలలుగా వేతనాల్లేవ్..
పాతమంచిర్యాల: ఉపాధిహామీ కూలీలకు 15రోజులకోసారి వేతనాలు అందించాలనే నిబంధన అమలుకు నోచుకోవడంలేదు. నాలుగు నెలలుగా వేతనాలు రావడం లేదని కూలీలు వాపోతున్నారు. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తంజేస్తున్నారు. నిత్యావసర వస్తువులకు డబ్బులు లేక అప్పులు చేయాల్సి వస్తోందని చెబుతున్నారు. క్రమం తప్పకుండా అఽధికారులు నిర్దేశించిన ప్లాంటేషన్, క్యాటిల్‌షెడ్లు, ఇంకుడుగుంతలు, రోడ్డు నిర్మాణ పనులకు వెళ్తున్నామని తెలిపారు. రోజంతా కష్టపడ్డా కూలి రూ.300–రూ.307 మాత్రమే గిట్టుబాటు అవుతుందని పేర్కొన్నారు. వచ్చే తక్కువ వేతనం కూడా సకాలంలో రాక కుటుంబ పోషణ కష్టంగా మారిందని వాపోయారు. ఉన్నతాధికారులు స్పందించి నెలనెలా వేతనాలు వచ్చేలా చూడాలని కోరుతున్నారు. ఈ విషయమై జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులను సంప్రదించగా కూలీల వేతనాలు వారి ఆధార్‌కార్డు ఆధారంగా ఖాతాల్లోనే ప్రభుత్వం జమచేస్తుందని తెలిపారు. ప్రతీనెల వేతనాల కోసం నివేదికలు తయారు చేసి పంపిస్తున్నామని పేర్కొన్నారు.
కూలీలు
2,37,997
జాబ్ కార్డులు
1,21,208