
అణచివేతను ప్రశ్నించిన వీరవనిత ఐలమ్మ
మంచిర్యాలఅగ్రికల్చర్: తెలంగాణ సాయుధ, భూ పోరాట ఉద్యమంలో కీలకపాత్ర పోషించి పెత్తందారుల అణచివేతను ప్రశ్నించిన వీర వనిత చాకలి ఐలమ్మ అని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఐలమ్మ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. కలెక్టర్‌తోపాటు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి పురుషోత్తం నాయక్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సంఘాల నాయకులు ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ భూమి, భుక్తి, విముక్తి కోసం పోరాడిందని, సాగు చేసే వారికి భూమి కోసం ఉద్యమించిందని తెలిపారు. తెలంగాణ భూ పోరాటానికి నాంది పలికిన మొదటి వ్యక్తి చాకలి ఐలమ్మ అని తెలిపారు.
పనులు వేగవంతం చేయాలి
మంచిర్యాలరూరల్(హాజీపూర్)/మంచిర్యాలటౌన్: ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్‌దీపక్ తెలిపారు. బుధవారం ఆయన గుడిపేటలోని ప్రభుత్వ వైద్య కళాశాల, కాలేజీ రోడ్డులోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నిర్మాణ పనులను పరిశీలించారు. రోడ్లు, భవనాల శాఖ డీఈ సజ్జత్‌భాషా, ఈఈ లక్ష్మీనారాయణ, ఏఈఈ అనూష, కళాశాల ప్రాజెక్ట్ జనరల్ మేనేజర్ సంపూర్ణరావు పాల్గొన్నారు.
పుష్కరాలకు ఏర్పాట్లు చేయాలి
లక్సెట్టిపేట: మండల కేంద్రంలో 2027లో నిర్వహించే గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం స్థానిక గోదావరి నదీ తీరం, పుష్కరఘాట్ పరిశీలించారు. తహసీల్దార్ దిలీప్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ విజయ్‌కుమార్, మేనేజర్ రాజశేఖర్ పాల్గొన్నారు.

అణచివేతను ప్రశ్నించిన వీరవనిత ఐలమ్మ