
దాడి కేసులో ఇద్దరి రిమాండ్
కాసిపేట: మండలంలోని ముత్యంపల్లికి చెందిన గిన్నె సతీశ్‌పై దాడి చేసి గాయపరిచిన ఘటనలో బుధవారం ముద్రకోల్ల రాజా, ఆవుల రాజేందర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. జూలై 27న ముత్యంపల్లి మాడల్‌స్కూల్, పోచమ్మ గుడి సమీపంలో మోటార్ సైకిల్‌పై వేగంగా వెళ్తున్న వారిని సతీశ్ మందలించాడు. దీంతో బూతులు తిడుతూ దాడిచేసి బండరాళ్లపై తోయడంతో తీవ్రగాయాలైనట్లు తెలిపారు. బాధితుడి సోదరి లత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసి ఇద్దరిని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.
ఆర్టీసీ బస్టాండ్‌లో చోరీ
ఖానాపూర్: పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో బుధవారం ఇద్దరు మహిళల వద్ద నగదు చోరీకి గురైంది. మండలంలోని ఎర్వచింతల్‌కు చెందిన శివస్మితకు చెందిన రూ.5వేలతో పాటు జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలానికి చెందిన సాయమ్మకు చెందిన రూ.20వేలను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. జగిత్యాల బస్సు ఎక్కే క్రమంలో జనం రద్దీ ఎక్కువగా ఉండడంతో దొంగలు ఇదే అదనుగా చేతివాటం ప్రదర్శించారు. దీంతో బాధితులు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా ఎస్సై రాహుల్ గైక్వాడ్ ఆధ్వర్యంలో సిబ్బంది అక్కడికి చేరుకుని తనిఖీ చేశారు.
ఇద్దరికి ఆరునెలల జైలు
ఉట్నూర్‌రూరల్: ఉట్నూర్ సబ్ కలెక్టర్ యువరాజ్ ఆదేశాల మేరకు మండలంలోని కొత్తగూడ గ్రామానికి చెందిన పాత కేసుల్లో నిందితులుగా ఉన్న వ్యక్తులను జైలుకు తరలించినట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపా రు. బైండోవర్ ప్రక్రియలో భాగంగా నిర్ణీత కాలంలో తగిన ష్యూరిటీలు అందించనందున వారిని ఆరునెలల జైలు శిక్షలో భాగంగా బుధవారం ఆదిలాబాద్ జైలుకు తరలించినట్లు పేర్కొన్నారు.
ఒకరికి ఐదేళ్లు..
మందమర్రిరూరల్: మందమర్రి పట్టణానికి మేసినేని కార్తిక్‌కు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి నిర్మల ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ బుధవారం తీర్పు చెప్పినట్లు ఎస్పై రాజశేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఊరు మందమర్రికి చెందిన కార్తిక్ చిన్నతనంలోనే తలిదండ్రులను కోల్పోయి చెడు అలవాట్లకు బానిసయ్యాడు. ఈక్రమంలో కార్తిక్ తన చిన్నమ్మ మేసినేని భీమక్కను మద్యం కోసం డబ్బులు అడగగా ఆమె నిరాకరించింది. దీంతో ఆమె తలపై బండరాయితో దాడి చేశాడు. భీమక్క కుమారుడు సంజీవ్ తన తల్లిపై జరిగిన దాడి విషయంపై కార్తిక్‌ను మందలించాడు. తనను సంజీవ్ మందలించాడనే విషయాన్ని మనసులో పెట్టుకుని 23 ఫిబ్రవరి 2020న సంజీవ్ ఇంట్లో ఉన్నప్పుడు గొడ్డలితో తలపై దాడి చేశాడు. దీంతో సంజీవ్ ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై శివకుమార్ కేసు నమోదు చేయగా తర్వాత ఎస్సై భూమేశ్ దర్యాప్తు చేపట్టారు. కేసు ట్రయల్ సమయంలో కోర్టు కానిస్టేబుల్ సురేందర్ ముఖ్య సాక్షులను ప్రవేశపెట్టగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ నంది రవీందర్ విచారణలో కీలకపాత్ర పోషించారు. నిందితునికి విచారణ అనంతరం ఐదేళ్ల శిక్షఽ విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించిందని ఎస్సై తెలిపారు. ఈ సందర్భంగా నిందితునికి శిక్ష పడేలా చేసిన ఎస్సై, కానిస్తేబుల్, పీపీ తదితరులను డీసీపీ భాస్కర్, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, మందమర్రి సీఐ శశిధర్‌రెడ్డి అభినందించారు.
వ్యాపారిని బెదిరించిన వ్యక్తిపై కేసు
ఇంద్రవెల్లి: ఎడ్లు తరలిస్తున్న వ్యాపారిని ఆపి డబ్బులు డిమాండ్ చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. ఇచ్చోడ మండలంలోని చించోలి గ్రామానికి చెందిన ఎండీ సాదిక్ అనే వ్యాపారి మంగళవారం రాత్రి ఆదిలాబాద్ రూరల్ మండలంలోని అంకోలి గ్రామానికి వెళ్లి రెండు ఎడ్లను కొనుగోలు చేసి ఆటోలో ఇచ్చోడకు తరలిస్తున్నాడు. ఈ క్రమంలో మార్గమధ్యలో ఇంద్రవెల్లి మార్కెట్ వద్ద తగ్రే ఇందల్‌తోపాటు మరికొందరు ఆటో ఆపి ఎడ్లకు సంబంధించిన పత్రాలు చూపించాలని డిమాండ్ చేశారు. ఎలాంటి పత్రాలు లేకపోవడంతో డబ్బులు డిమాండ్ చేసి ఘర్షణకు దిగారు. దీనిపై ఎండీ సాదిక్ ఫిర్యాదు మేరకు తగ్రే ఇందల్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేశారు. అతడిని ఉట్నూర్ కోర్టుకు రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.

దాడి కేసులో ఇద్దరి రిమాండ్