
ఒకరి అనుమానాస్పద మృతి
లక్సెట్టిపేట: మండలంలోని వెంకట్రావుపేట గ్రామానికి చెందిన మురిమడుగుల మల్లయ్య (58) చికిత్స పొందుతూ మృతి చెందినట్లు స్థానిక ఎస్సై సురేశ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మల్లయ్య కొద్దిరోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటున్నాడు. ఈనెల 9న సాయంత్రం ఇంటి నుంచి బయటికి వెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చి కుర్చీలో కూర్చోగా నోటి నుంచి నురగలు వచ్చాయి. గమనించిన కుటుంబీకులు వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా, తన తండ్రి మల్లయ్య మృతికి పాము కాటా.. లేదా అనారోగ్యమా? అనేది తెలియడం లేదని మృతుడి కుమారుడు అరుణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.