
గంజాయి సాగు చేస్తున్న ఇద్దరిపై కేసు
వాంకిడి: పత్తి చేసులో గంజాయి సాగు చేస్తున్న ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేందర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఆర్లీ గ్రామ శివారులోగల పత్తి చేనులో గంజాయి మొక్కలు సాగు చేస్తున్నారనే సమాచారంతో సిబ్బందితో కలిసి బుధవారం తనిఖీలు నిర్వహించారు. మండల కేంద్రంలోని పెరకవాడకు చెందిన ఆకిరెడ్డి పోచయ్య అనే వ్యక్తి చేనులో ఎనిమిది గంజాయి మొక్కలు, ఆర్లి గ్రామానికి చెందిన కావుడె బాజీరావు చేనులో 11 గంజాయి మొక్కలు లభ్యమయ్యాయి. మొక్కలను స్వాధీనం చేసుకుని ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.