
కుక్కల దాడిలో గొర్రెలు మృతి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుండెల రమేశ్‌కు చెందిన ఏడు గొర్రెలు కుక్కల దాడిలో మృతి చెందాయి. వివరాలు.. బుధవారం రమేశ్ ఏడు గొర్రెలను ఇంటిలోని ఓ షెడ్డులో కట్టేసి మిగతా వాటిని మేతకు తీసుకువెళ్లాడు. అతడి భార్య కూలీ పనికి వెళ్లిపోయింది. ఈక్రమంలో ఇంటి పరిసరాలు ప్రశాంతంగా ఉన్న సమయంలో ఒక్కసారిగా కుక్కలు గొర్రెలపై దాడి చేసి తీవ్రంగా గాయపరచగా అవి మృతి చెందాయి. రమేశ్ దంపతులు ఇంటికి తిరిగి వచ్చి మృతి చెందిన గొర్రెలను చూసి కన్నీటి పర్యంతమయ్యారు.