
చికిత్స పొందుతూ ఒకరి మృతి
లక్ష్మణచాంద: ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని వడ్యాల్ తండా గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు.. వడ్యాల్ తండాకు చెందిన దరావత్ నందు (25) గత నెల 30న తన భార్యతో కలిసి నిర్మల్‌కు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. ఈ క్రమంలో నిర్మల్ రూరల్ మండలంలోని కొండాపూర్ జాతీయ రహదారిపై ఇతని ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడిని ముందు నిర్మల్ ఏరియా ఆస్పత్రికి, ఆ తరువాత హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.