
మిస్సింగ్ కేసు నమోదు
తానూరు: మండలంలోని ఎల్వి గ్రామానికి చెందిన పన్నెవాడ్ లక్ష్మణ్ (56) ఆ చూకీ లభించకపోవడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై షేక్ జుబేర్ బుధవారం తెలిపారు. ఆ యన తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మణ్ గత నెల 31న తన కుమారుడు గణేశ్‌తో కలిసి వ్యవసాయ పనులకు వెళ్లాడు. అదేరోజు సాయంత్రం హైదరాబాద్‌లో నిర్వహించే గణేశ్ నిమజ్జనోత్సవాలు చూసి వస్తానని కుమారుడికి చె ప్పి వెళ్లిపోయాడు. 10 రోజులైనా తిరిగి రాలే దు. కుటుంబ సభ్యులు వెతికినా అతడి ఆచూకీ లభించలేదు. మంగళవారం రాత్రి అతడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.