
ఉదారి నారాయణకు కీర్తి పురస్కారం
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాకు చెందిన కవి, రచయిత ఉదారి నారాయణ 2024 సంవత్సరానికి కీర్తి పురస్కారానికి ఎంపికై నట్లు తెలుగు యూనివర్సిటీ వీసీ సురవరం ప్రతాప్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఆదిలాబాద్ యాసలో తనదైన శైలిలో కవితలు రాస్తున్నందుకు ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ఈనెల 23, 24 తేదీల్లో హైదరాబాద్‌లోని యూనివర్సిటీ ఆడిటోరియంలో అవార్డు అందజేయనున్నట్లు తెలిపారు. అవార్డు కింద రూ.5,116 నగదుతో పాటు ప్రశంసాపత్రం అందజేయనున్నట్లు వివరించారు. ఆయన ఎంపిక కావడంపై పలువురు కవులు, రచయితలు అభినందనలు తెలిపారు.
గుడుంబా పట్టివేత
భీమిని: మండలంలోని మల్లీడి గ్రామానికి చెందిన కోట ఇస్తారి ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన ఐదు లీటర్ల గుడుంబాను శనివారం పట్టుకున్నట్లు ఎస్సై విజయ్‌కుమార్ తెలిపారు. పట్టుబడిన గుడుంబా విలువ రూ.2వేలు ఉంటుందని పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. గుడుంబా తయారు చేసినా, విక్రయించినా కఠినచర్యలు తీసుకుంటమాని హెచ్చరించారు.
విద్యార్థులకు విద్య, వైద్యం అందించాలి
ఉట్నూర్‌రూరల్: ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు మెరుగైన విద్య, వైద్యం అందించాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా సూచించారు. బుధవారం ఐటీడీఏ కార్యాలయ చాంబర్‌లో ఉమ్మడి జిల్లాల ఉపసంచాలకులు, సహాయ గిరిజన సంక్షేమ అధికారులతో ఆశ్రమ పాఠశాలల పర్యవేక్షణపై సమీక్ష నిర్వహిచారు. విద్యార్థులకు అందిస్తున్న విద్య, వైద్యం, భోజనం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. గిరిజన కోఆపరేటివ్ సొసైటీ ద్వారా ఆశ్రమ పాఠశాలలకు సరుకులు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గిరిజన సహాయ సంక్షేమ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ప్రిన్సిపల్ గది, స్కూల్ ఆవరణలోని సీసీ కెమెరాలు పనిచేసేలా చూడాలని తెలిపారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఉమ్మడి జిల్లాల గిరిజన సంక్షేమ ఉపసంచాలకులు అంబాజీ, రమాదేవి, ఏటీడీవోలు, ఏసీఎంవోలు, అదనపు వైద్యశాఖ అధికారి కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
పవర్ ప్లాంట్‌లో సింగరేణి డైరెక్టర్
జైపూర్: మండల కేంద్రంలోని ఎస్టీపీపీలో బుధవారం సింగరేణి డైరెక్టర్(ఈఅండ్‌ఎం) ఎం.తిరుమలరావు పర్యటించారు. ముందుగా ఆవరణలో మొక్క నాటారు. అడ్మిన్ కార్యాలయంలో ఎస్టీపీపీ ఈడీ చిరంజీవి, జీఎం శ్రీని వాసులు, అధికారులు, ఉద్యోగులతో సమావేశమయ్యారు. విద్యుదుత్పత్తి, పనితీరుపై అధికా రులు వివరించారు. ఉత్పత్తిలో దేశస్థాయిలో ఇప్పటివరకు 50కిపైగా అవార్డులు అందుకోవడంపై హర్షం వ్యక్తంజేశారు. ఇదేస్ఫూర్తితో 800 మెగావాట్ల కొత్త ప్లాంట్ పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సూచించారు.
శిక్షణ కేంద్రంలో ప్రవేశాలు
మంచిర్యాలటౌన్: జిల్లా కేంద్రంలోని ఖేలో ఇండియా బాక్సింగ్ శిక్షణ కేంద్రంలో ప్రవేశాలు స్వీకరిస్తున్నట్లు జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి హనుమంతరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న 10–20 ఏళ్లలోపు బాలబాలికలు వివరాలకు కోచ్ రాజేశ్‌ను 9963539234 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

ఉదారి నారాయణకు కీర్తి పురస్కారం

ఉదారి నారాయణకు కీర్తి పురస్కారం