ఇంద్రవెల్లి: ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన బుధవారం మండలంలోని దనోరా (బీ) గ్రామ సమీపంలోని ప్రధాన రహదారిపై చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు, 108 పైలట్ రాజేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. గుడిహత్నూర్ మండలంలోని మన్నూర్‌కు చెందిన సంతోష్ తన స్నేహితుడు బాలాజీతో కలిసి ద్విచక్రవాహనంపై దనోరా నుంచి గుడిహత్నూర్ వైపు వెళ్లడానికి ప్రధాన రహదారి ఎక్కుతున్నాడు. ఇదే క్రమంలో ఎదురుగా గుడిహత్నూర్ నుంచి ఉట్నూర్ వైపు కుటుంబ సభ్యులతో వస్తున్న ఉట్నూర్ మండలంలోని ఉమ్రి గ్రామానికి చెందిన టిత్రే అర్జున్ ద్విచక్రవాహనాన్ని వేగంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో మన్నూర్‌కు చెందిన సంతోష్‌కు ఎడమ చేయికి తీవ్ర గాయాలు కాగా, తోడుగా ఉన్న బాలాజీకి స్వల్ప గాయాలయ్యాయి. ఉట్నూర్ మండలంలోని ఉమ్రి గ్రామానికి చెందిన అర్జున్‌కు తలకు తీవ్ర గాయాలు కాగా, అతడి భార్య శారద కుడి చేతికి గాయాలయ్యాయి. పెద్ద కొడుకు కార్తి క్‌కు ముక్కు, తలకు, చిన్న కొడుకు రితిక్‌కు ఎడమ కాలుకు తీవ్ర గాయాలైనట్లు వారు తెలిపారు. వెంటనే స్థానికులు 108 అంబులెన్స్‌లో వారిని ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
రెండు ద్విచక్రవాహనాలు ఢీ