
కన్నీళ్లు పెట్టుకున్న హైకోర్టు జడ్జి
మామడ: మండలంలోని నల్దుర్తి గ్రామానికి చెందిన ఉదయ్ అనే యువకుడు మంగళవారం కనకాపూర్ వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. బుధవారం నల్దుర్తి గ్రామంలో అతడి అంత్యక్రియలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని తమ నివాసంలో సహాయకుడిగా పనిచేసే ఉదయ్ అంత్యక్రియలకు హైకోర్టు జడ్జి జువ్వాడి శ్రీదేవి, డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు దంపతులు హాజరయ్యారు. తమ కుటుంబంలో ఒకరిగా మెదిలిన ఉదయ్ భౌతికకాయం చూడగానే భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. అతని కుటుంబ సభ్యులను ఓదార్చారు. తల్లిదండ్రులు లేని ఉదయ్ కొన్నేళ్లుగా తమ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా ఉంటున్నాడని, రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమని పేర్కొన్నారు. అంత్యక్రియల్లో గ్రామస్తులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.