
ఏటీఎం చోరీకి యత్నించిన వ్యక్తి అరెస్ట్
ఆదిలాబాద్‌టౌన్: జిల్లా కేంద్రంలోని ఏటీఎంలో చోరీకి యత్నించిన నిందితుడు బిప్లబ్‌కుమార్ జీనను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఒరిస్సా రాష్ట్రం బలేశ్వర్ జిల్లా జమల్‌పూర్‌కు చెందిన నిందితుడు ఈనెల 8న అర్ధరాత్రి జిల్లా కేంద్రంలోని పంజాబ్‌చౌక్‌లోగల డీబీఎస్ ఏటీంలో చోరీకి యత్నించినట్లు తెలిపారు. గడ్డపారతో ఏటీఎంను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించగా అలారం మోగడంతో పారిపోయినట్లు పేర్కొన్నారు. దీంతో ఎస్పీ వన్‌టౌన్, టూటౌన్ సీఐలను అప్రమత్తం చేసినట్లు చెప్పారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు. 2011 నుంచి 2015 వరకు ఆదిలాబాద్ పట్టణంలోని పలు హోటళ్లలో నిందితుడు పనిచేసినట్లు తెలిపారు. దొంగతనానికి యత్నించిన సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని పట్టుకున్న వన్‌టౌన్ సీఐ సునీల్‌కుమార్, టూటౌన్ సీఐ నాగరాజు, ఎస్సై, సిబ్బందిని ఎస్పీ అభినందించినట్లు పేర్కొన్నారు.