ఖాకీల ఓవరాక్షన్‌! | - | Sakshi
Sakshi News home page

ఖాకీల ఓవరాక్షన్‌!

Sep 10 2025 3:47 AM | Updated on Sep 10 2025 3:47 AM

ఖాకీల ఓవరాక్షన్‌!

ఖాకీల ఓవరాక్షన్‌!

మంచిర్యాలక్రైం: వినాయక నిమజ్జనం వేళ పోలీస్‌ అఽధికా రుల తీరు వి వాదాస్పదమైంది. ఇందా రం వద్ద గోదా వరిలో విగ్రహా లు నిమజ్జనం చేస్తుండగా జీడీకే–11గని ఆపరేటర్‌ గాండు శ్రావణ్‌కుమార్‌ క్రేన్‌ ఆపివేయగా ట్రాఫిక్‌ జామ్‌ అవుతుందని చెన్నూర్‌ రూ రల్‌ సీఐ బన్సీలాల్‌ ఆగ్రహంతో అతడిపై చే యి చేసుకున్నాడు. దీనిపై సింగరేణి జీఎం ల లిత్‌కుమార్‌కు సింగరేణి కార్మికులు ఫిర్యాదు చేయగా అతడు సీపీ అంబర్‌కిషోర్‌ ఝా దృష్టికి తీసుకెళ్లారు. సీపీ విచారణ చేపట్టాలని మంచిర్యాల డీసీపీ భాస్కర్‌ను ఆదేశించారు. అలాగే, లక్సెట్టిపేటలోని మహాలక్ష్మివాడలో ఈ నెల 8న నిమజ్జన శోభాయాత్ర నిర్వహిస్తుండగా ఇతర విధుల్లో సీఐ రమణమూర్తి, దండేపల్లి ఎస్సై తౌసినొద్దీన్‌ సివిల్‌ డ్రెస్‌లో అ టువైపు వెళ్లారు. ఈ క్రమంలో శోభాయాత్రలో పాల్గొన్న వారిపై వారు చేయి చేసుకున్న ట్లు స్థానికులు ఆరోపించారు. శోభాయాత్రలో పోలీసులు, స్థానిక యువకులకు మధ్య వా గ్వాదం చోటు చేసుకుంది. దీంతో సీఐ తన చేతిలోని రివాల్వర్‌ చూపిస్తూ యువకులపై బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఈ వి షయమై సీఐ రమణమూర్తిని వివరణ కోరగా.. శోభాయాత్రకు, వీళ్ల గొడవకు సంబంధం లేదని తెలిపారు. ఇతర విధుల్లో హాస్పిట ల్‌ వైపు వెళ్తుండగా పాత బస్టాండ్‌ సమీపంలో మద్యం సేవించిన సుమారు 20మంది యువకులు గొడవపడుతున్నారని, వారిని నివారించే ప్రయత్నం చేయగా తమపైనే దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. శోభాయాత్రకు సంబంధించిన వ్యక్తులు కాదని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement