
జాతీయ లోక్ అదాలత్‌పై సమీక్ష
మంచిర్యాలక్రైం: ఈ నెల 13న జిల్లాలోని అన్ని కో ర్టుల్లో నిర్వహించనున్న జాతీయ లోక్‌అదాలత్‌పై జి ల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికా ర సంస్థ చైర్మన్ వీరయ్య మంగళవారం జిల్లా పో లీ స్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. లోక్ అదాలత్‌లో క్రిమినల్, సివిల్, బ్యాంక్, చెక్‌బౌన్స్ కేసులు రాజీ కుదుర్చనున్నట్లు తెలిపారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కేసుల్లోని కక్షిదారులతో మాట్లాడి రాజీ కుదిర్చేందుకు న్యాయవాదులు, పోలీస్ అధికారులు కృషి చేయాలని సూ చించారు. కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాల ని కోరారు. డీసీపీ భాస్కర్, ఏసీపీలు ప్రకాశ్, వెంకటేశ్వర్లు, రవికుమార్, సీఐలు, ఎస్సైలు, జిల్లా న్యా యసేవాధికార సంస్థ కార్యదర్శి నిర్మల ఉన్నారు.